చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అనధికారికంగా శివలింగం, నందీశ్వరుడు విగ్రహాల ఏర్పాటు పై ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని శాప్ మాజీ ఛైర్మన్ పీ ఆర్ మోహన్ డిమాండ్ చేశారు. ఆలయాన్ని పరిరక్షించాలని రాజగోపురం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అధికారుల ప్రమేయంతోనే అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆలయ అధికారులతో విచారణ చేపడితే న్యాయం జరగదని వాపోయారు. ఈవోను విధుల నుంచి తొలగించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కోరారు.
'విగ్రహాల ఏర్పాటుపై సీబీఐ విచారణ జరిపించాలి' - srikalahasti tdp leaders agitation
అనధికారంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విగ్రహాల ఏర్పాటుపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఆలయాన్ని పరిరక్షించాలంటూ నేతలు నిరసన చేపట్టారు.
తెదేపా నేతల నిరసన