తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. చిత్తూరు జిల్లా సత్యవేడులో తెదేపా సన్నాహక సమావేశాన్ని నిర్వహంచింది. ఎదుటివారిని హింసించడమే జగన్ దినచర్య అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
అస్తవ్యస్త పాలన చేసిన వారెవరూ అధికారంలో ఉన్న దాఖలాల్లేవని అన్నారు. అవినీతి, అక్రమ, దౌర్జన్య, బెదిరింపు రాజకీయాలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేశ రాజకీయాల్లో తెదేపాకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.