తెదేపా (TDP) ను బలోపేతం చేయడానికి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy chandramohan reddy) అన్నారు. ఆదివారం ఆయన రాజంపేట (Rajampeta) పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మదనపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల (krishna water) విషయంలో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దొంగాట ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మూడు కలిపి అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని.. వీటిని అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ (CM JAGAN) ప్రధానమంత్రికి లేఖలు రాయడం పక్కన పెట్టి.. ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
కృష్ణా జలాలు రాయలసీమకు దక్కని దుస్థితి
వైకాపా (YSRCP) అధికారంలోకి వచ్చిన తరువాత.. కృష్ణా జలాలు (krishna water) రాయలసీమకు దక్కని పరిస్థితులు నెలకొన్నాయని సోమిరెడ్డి ఆవేదన చెందారు. స్వార్థ ప్రయోజనాల కోసం వెనుకబడిన రాయలసీమ హక్కులను పట్టించుకునే పరిస్థితులు.. సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) ప్రభుత్వానికి లేకపోవడం దుదృష్టకారమన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది విమర్శించారు.
ప్రాజెక్టుల కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాం