ఉద్యోగ సంఘాలు ఎన్నికలను బహిష్కరిస్తామనడం తగదని.. తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో.. కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల పక్రియను తేదేపా స్వాగతిస్తోందని తెలిపారు. రాజకీయ నేతల వల్ల.. బాధ్యతగల ఉద్యోగ సంఘాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు.
ఉద్యోగ సంఘాలు ఎన్నికలు బహిష్కరిస్తామనడం సరికాదు.. - శ్రీకాళహస్తిలో పార్టీ కార్యకర్తలతో తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ సమావేశం
ఎన్నికలు బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం జగన్ కావాలనే ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కరోనా విజృంభణ సమయంలో ఎన్నికలు నిలిపివేయడంపై సీఎం జగన్ స్పందిస్తూ.. కొవిడ్ కేవలం జ్వరం లాంటిదని, పారాసిట్మాల్తో నయం చేయవచ్చని అప్పట్లో చెప్పిన విషయాన్ని నరసింహ యాదవ్ గుర్తుచేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టినా.. అదే సీఎం కరోనా పేరుతో ఎన్నికలను అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అధికారులు.. బాధ్యత మరిచి ప్రకటనలు చేయడాన్ని తప్పుపట్టారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగాయని.. అక్కడ సిబ్బంది రాష్ట్ర అధికారులు మాదిరిగా ప్రవర్తించలేదని విమర్శించారు.
ఇదీ చదవండి:ఎన్నికల కోడ్‌పై చిత్తూరులో అయోమయం.. ప్రజల్లో సందిగ్ధం