LOKESH FIRES ON JAGAN: ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే.. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను జైలుకు పంపుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపేందుకు పెట్టిన అన్న క్యాంటీన్లపై దాడులు చేయడం ఏంటని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెదేపానేనని.. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జైలులో ములాఖత్ ద్వారా.. తెలుగుదేశం నాయకులను ఆయన పరామర్శించారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 2010 అన్న క్యాంటీన్లు మూసివేశారని.. తల్లి, సోదరికి ముద్ద పెట్టని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా పెడతారని ప్రశ్నించారు. పేదలకు భోజనం లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు.