ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల నాయుడు మృతి తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ఈ నెల 18 న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి ఆయన మృతి చెందారు. వరహాల నాయుడు కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్టీసీ కార్మిక పరిషత్ లో ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తూ.. రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకొన్న గొప్ప వ్యక్తి వరహాల నాయుడు అని కొనియాడారు. 24 గంటలూ కార్మికులకు అందుబాటులో ఉండి.. కార్మిక సమస్యల పైన పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తుచేశారు. వరహాల నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని పట్టాభిరాం ఆకాంక్షించారు.
వరహాల నాయుడు మృతి పట్ల తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంతాపం - వరహాల నాయుడు మృతికి సంతాపం తెలిపిన టీడీపీ నేత
ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల నాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సంతాపం తెలిపారు. వరహాల నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని పట్టాభిరాం ఆకాంక్షించారు.

వరహాల నాయుడు మృతి పట్ల తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంతాపం
TAGGED:
News on rtc varahala naidu