ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గృహనిర్బంధించిన చిత్తూరు తెదేపా నేతలను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా అని నిలదీశారు.
ఎన్నికల్లో వైకాపా మంత్రులు చేసిన అక్రమాలు బయటపడతాయని భయమా అని ప్రశ్నించారు. వైకాపా అవినీతిని ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు వివరిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజల తరఫున నిలబడితే గృహనిర్బంధాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.