ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. తెదేపా వర్గాల ఆగ్రహం - violation of election code news

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. యర్రావారిపాళ్యం మండలంలోని ఉస్తికాయల పెంట గ్రామ సచివాలయంలో రాత్రి పూట ఇళ్ల పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుంది.

violation of election code
ఇళ్ల పట్టాలు పంపిణీ

By

Published : Jan 31, 2021, 12:24 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని తెదేపా వర్గాలు అంటున్నాయి. యర్రావారిపాళ్యం మండలంలోని ఉస్తికాయల పెంట గ్రామ సచివాలయంలో రాత్రి 9:30గంటల సమయంలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి.

ధ్రువపత్రాల అవసరానికి కార్యాలయానికి వస్తే తప్పించుకునే అధికారులు రాత్రిపూట దొంగతనంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటాన్ని తెదేపా నేతలు తప్పుపట్టారు. వీఆర్వోలు, వాలంటీర్స్ గుట్టుచప్పుడు కాకుండా పట్టాలను ఇంటింటికి చేరవేయడానికి సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పట్టాల పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టాల పంపిణీపై ఎస్ఈసీ దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:"బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించం"

ABOUT THE AUTHOR

...view details