ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆరాచక ప్రభుత్వానికి న్యాయదేవత దండన విధించింది' - మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వార్తలు

ఆరాచక ప్రభుత్వానికి న్యాయదేవత దండన విధించిందంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో తెదేపా నేతలు నినాదాలు చేశారు. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను తొలగించేందుకు జీవోలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఇది చెంప పెట్టులాంటిదని సుగుణమ్మ పేర్కొన్నారు.

tdp ex mla
tdp ex mla

By

Published : May 29, 2020, 4:01 PM IST

హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. తిరుపతిలోని ఆమె ఇంటి వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరాచక ప్రభుత్వానికి న్యాయదేవత దండన విధించిందంటూ బ్యానర్లను ప్రదర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ ను తొలగించేందుకు జీవోలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటిదని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా, చట్టబద్దంగా పరిపాలించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details