తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్లు వేసే వాళ్లను అడ్డుకోవడం, ఇప్పటికే వేసిన వారిని బలవంతపు ఉపసంహరణలపై జిల్లా కలెక్టర్ హరినారాయణకు ఫిర్యాదు చేశామని... తిరుపతి మాజీఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. నామినేషన్ వేసిన వారిలో ఏడుగురిని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశారని సుగుణమ్మ ఆరోపించారు. మరో 11 ప్రాంతాల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు.
'నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాలి' - tirupati municipality
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గత నామినేషన్ ప్రక్రియలో... నామినేషన్లు వేయలేకపోయిన వాళ్లకు తిరిగి అవకాశం కల్పించాలని... తిరుపతి మాజీఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బలవంతపు ఉపసంహరణలపై కలెక్టర్ హరినారాయణకు ఫిర్యాదు చేశారు.
!['నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాలి' tdp compliant to collector harinarayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10704299-711-10704299-1613815466426.jpg)
నామినేషన్ల క్రమంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలి