చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో... తెదేపా నాయకుల నామినేషన్ పత్రాలను వైకాపా శ్రేణులు చించివేశారు. నామినేషన్ల చివరి రోజైన నేడు... కుప్పం 14వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఏంపీపీ వెంకటేష్ పై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. సమాచారం అందుకున్న మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని గాయపడ్డ వెంకటేష్ ను ఆస్పత్రికి తరలించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమయం ముగియనుంది. దీంతో ఆ అభ్యర్థి ఆందోళనకు గురవుతున్నారు.
కుప్పంలో టెన్షన్.. తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు - ఏపీ 2021 వార్తలు
చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే నామినేషన్ సమయం ముగియనుండగా.. తెదేపా అభ్యర్థి ఆందోళన పడుతున్నారు.
కుప్పంలో టెన్షన్
Last Updated : Nov 5, 2021, 3:02 PM IST