చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం మినహా....మిగిలిన అన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. "వైకాపా సాగిస్తున్న దౌర్జన్యాలను నిరసిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నం" అని తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ప్రకటించారు. నామినేషన్ల దాఖలు సమయం నుంచి.. ఉపసంహరణ వరకూ అడుగడుగునా తెదేపా నాయకులను వైకాపా శ్రేణులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. పార్టీ నిర్ణయంతో....తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన 25 ఎంపీటీసీ స్థానాలకు తెదేపా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఒక్క చంద్రగిరి మండలం మినహా.. మిగిలిన అన్ని మండలాల్లోనూ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకుని.. ఎన్నికల జరుగుతున్న తీరును ఎండగడతామని నాని చెప్పారు.
'చంద్రగిరి మినహా.. నియోజకవర్గమంతా ఎన్నికల బహిష్కరణ' - చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి మండలం మినహా.. అన్ని మండలాల్లో స్థానిక ఎన్నికలను తెదేపా బహిష్కరించింది. వైకాపా నేతల దౌర్జన్యాలే ఇందుకు కారణమని తెలిపింది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు బహిష్కరించిన తెదేపా