చైనాలో ఇరుక్కుపోయిన తెలుగు ఇంజినీర్లంతా క్షేమంగా ఉన్నారని టీసీఎల్ కంపెనీ స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా వికృతమాలలో నూతనంగా నిర్మితమవుతున్న ఈ కంపెనీకి సంబంధించి... శిక్షణ పొందేందుకు 93మంది ఇంజినీర్ల బృందం గతేడాది చైనాకు వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశం కరోనా వైరస్ గుప్పెట్లో ఉండటంతో... వారంతా స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.
వూహాన్ నగరంలో చిక్కుకుపోయిన 58మంది ఇంజినీర్ల ఆరోగ్యంపై పలు ఊహాగానాలు తలెత్తుతున్న నేపథ్యంలో టీసీఎల్ కంపెనీ దీనిపై స్పందించింది. ఇంజినీర్లను హౌస్ అరెస్ట్ చేశారన్న పుకార్లు అవాస్తమని కంపెనీ స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా వూహాన్ నగరంలో రాకపోకల నిషేధమైనందున వారిని తిరిగి తీసుకురావటంలో ఆటంకాలు ఏర్పడ్డాయని వివరించారు.