తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను పుణ్యక్షేత్రాలకు చేరవేస్తూ ఉపాధి పొందే టాక్సీ డ్రైవర్లు, యజమానులు.. 2 నెలల నుంచి ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన తరహాలో... తమ వాహనాలు తిరగడానికీ అనుమతించాలని డ్రైవర్లు కోరారు. వాహనాలు తిరిగితే తప్ప పూట గడవని తమ పరిస్థితి గుర్తించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలంటున్న వారితో.. మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
'వాహనాలు తిరిగితేనే మాకు పూట గడిచేది' - తిరుపతిలో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు
లాక్‌డౌన్ సడలింపులతో వ్యాపార, వాణిజ్య సంస్థలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్టే... తమకూ అవకాశం ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు.
తిరుపతిలో టాక్సీ డ్రైవర్లతో ఈటీవీభారత్ ముఖాముఖి