పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ ఇంటి పైకప్పులను ప్రోత్సహిస్తున్నట్లు టాటా పవర్ సోలార్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు 18 నగరాల్లో సోలార్ ప్యానళ్ల విక్రయాన్ని ప్రారంభించిన టాటా సోలార్ సంస్థ ఏపీలో తొలిసారిగా తమ విక్రయాలను తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి ఐఐటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేలా సోలార్ రూఫ్ టాప్ వాహనాన్ని, సైకిల్ ర్యాలీని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. పునరుత్పాదక శక్తిని సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు.
'పర్యావరణ పరిరక్షణకు సోలార్ వ్యవస్థ' - tata solar
ఇంటిపై కప్పులపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని టాటా పవర్ సోలార్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏపీలో తొలిసారిగా తమ విక్రయాలను తిరుపతిలో ప్రారంభించారు.
సోలార్‌పై ప్రజలకు అవగాహన