చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని అటవీ ప్రాంతంలో జల్ల రాళ్ల గుట్ట వద్ద ఎర్రచందనం అక్రమ తరలింపు పై టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విలువైన 15 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తున్న తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా జవ్వాదికి చెందిన జయశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ వివరించారు.
టాస్క్ఫోర్సు దాడుల్లో.. 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రచందనం అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు అటవీ ప్రాంతంలో 15 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Task force seized 15 red sandalwood logs