చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం అటవీ ప్రాంతంలో టాస్క్ పోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరుగురు స్మగ్లర్లు అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు సమాచారం రావటంతో టాస్క్ ఫోర్స్ డీ ఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు.
వెంట తెచ్చుకున్న సంచులను వదిలి స్మగ్లర్లు పరారైనట్లు తెలిపారు. వారి బ్యాగులో కాషాయ వస్త్రాలు, నిత్యావసర సరుకులు ఉండటం గమనించి.. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా భావిస్తున్నారు.