చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అడవులలో టాస్క్ ఫోర్స్ అధికారులు నిరంతర కూంబింగ్ చేపట్టారు. భాకరాపేట మార్గంలో కల్యాణి డ్యాం సమీపంలో వాహనంలోకి ఎక్కించి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఒక స్మగ్లర్ను అరెస్ట్ చేయడంతో పాటు గూడ్స్ క్యారియర్ వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...స్మగ్లర్ అరెస్ట్
చిత్తూరు జిల్లాలో కల్యాణి డ్యాం వద్ద రవాణాకు సిద్దంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం సీజ్ చేసి...స్మగ్లర్ను అరెస్ట్ చేశారు.
టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు....గురువారం మధ్యాహ్నం నుంచి భాకరాపేట అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి కల్యాణి డ్యాం మీదుగా వస్తుండగా... తెల్లమరం అనే ప్రాంతంలో రాత్రి 2.00 గంటల సమయంలో స్మగ్లర్లు అలికిడి వినిపించింది. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన దాదాపు 40 మంది స్మగ్లర్లు దుంగలు పడేసి చీకటిలో పారి పోయారు. అయితే ఒక స్మగ్లర్ను పట్టుకోగలిగారు. సమీపంలో లోడింగ్‌కు సిద్దంగా ఉన్న వాహనం కనిపించింది. వాహనంలో ఎరువులకు సంబంధించిన బస్తాలు ఉన్నాయి. ఎర్రచందనం దుంగలను వాహనంలో ఎక్కించి, వాటిపైన మూటలు వేసి రవాణా చేస్తున్నట్లు పట్టుబడిన స్మగ్లర్ తెలిపాడు. విచారణలో స్మగ్లర్ తమిళనాడు తిరువన్నామలై జిల్లా చెంగం తాలూకా పాంబత్తూరుకు చెందిన కుమార్ (25)గా గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన స్మగ్లర్లు కోసం గాలింపు ముమ్మరం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ సుబ్రహ్మణ్యం... పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: