Taraka Ratna Health Update: యువగళం పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నను మెరుగైన వైద్య సేవల కోసం బెంగళూరు తీసుకెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో అత్యంత ఆధునికమైన అంబులెన్స్ లో క్రిష్ణగిరి మీదుగా బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్న భార్య, తల్లి ఇతర కుటుంబ సభ్యులు పీఈఎస్ కు చేరుకున్న తర్వాత వారితో వైద్యులు సంప్రదించారు. అనంతరం కుటుంబ సభ్యులకు కోరిక మేరకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నారాయణ హృదయాలయకు తరలించారు. అంబులెన్స్ కు పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో బెంగళూరు తీసుకెళ్లారు. తొలుత 48 గంటల పాటు కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించాలని భావించారు.
మెరుగుపడిన ఆరోగ్యం: నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగైందన్న వైద్యులు కుటుంబసభ్యులకు చెప్పారు. తారకరత్నను పరామర్శించేందుకు బెంగళూరుకు బాలకృష్ణ వెళ్లారు.