ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేకలు, గొర్రెలకు మేతగా టమోటా పంట

ఆరుగాలం కష్టపడిన టమాటా రైతు లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే...కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఓ రైతు పంటను కోయించలేక తోటలో మేకలు, గొర్రెలను వదిలేశాడు.

By

Published : May 19, 2020, 11:33 PM IST

amota faremrs facing problems due to lockdown not able to cutting tamotas weasting the field in chittoor dst
amota faremrs facing problems due to lockdown not able to cutting tamotas weasting the field in chittoor dst

కరోనా లాక్​డౌన్ కారణంగా టమోటా రైతులు ఆర్థికంగా చితికిపోయారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట గొల్లపల్లికి చెందిన టమోటా రైతు నాదముని తన టమోటా పొలంలో గొర్రెలు, మేకలను వదిలివేశాడు. పంట చేతికొచ్చిన సమయంలో లాక్​డౌన్ కొనసాగించడంతో కాయలను అమ్ముకోలేక పోయాడు. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోవటంతో కాయలను కోయకుండా తోటలోనే వదిలివేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details