తిరుపతిలో ఒక న్యాయ విద్యార్థి పరీక్ష రాస్తూ మృతి చెందడంతో విషాదం నెలకొంది. నగరంలోని అంబేడ్కర్ లా కళాశాలలో పరీక్ష రాస్తున్న న్యాయ విద్యార్థి బాలమురుగన్(43)కు ఫిట్స్ రావటంతో పరీక్షా కేంద్రంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని కళాశాల వర్గాలు తెలిపాయి.
తిరుపతిలో పరీక్ష రాస్తూ.. తమిళ లా విద్యార్థి మృతి - తిరుపతి తాజా వార్తలు
తిరుపతి నగరంలోని అంబేడ్కర్ లా కళాశాలలో పరీక్ష రాస్తున్న న్యాయ విద్యార్థి ఫిట్స్ తో మృతి చెందాడు. పరీక్షా కేంద్రం నిర్వాహకులు సకాలంలో ఆస్పత్రికి తరలించినప్పటికీ.. తమిళ విద్యార్థి అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

తమిళ లా విద్యార్థి మృతి
హుటాహుటిన విద్యార్థిని రుయా ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుని స్వస్థలం చెన్నైలోని తాంబరం కావడంతో పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి:రామతీర్థం ఘటనకు బాధ్యత వహించి అశోక్ గజపతి రాజీనామా చేయాలి : విజయసాయి