తమిళనాడు సాధారణ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న తనిఖీ కేంద్రాల వద్ద నిఘాను మరింత పటిష్టం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో తమిళనాడు రాష్ట్రం వేలూర్ జిల్లా కలెక్టర్ షణ్ముగ సుందరం, ఎస్పీ సెల్వ కుమార్‌తో పాటు ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన తమిళనాడు అధికారులు - చిత్తూరు సమాచారం
చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణను తమిళనాడు రాష్ట్రం వేలూరు కలెక్టర్ షణ్ముగం సుందరం, ఎస్పీ సెల్వ కుమార్ కలిశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దులో నిఘాను పటిష్టం చేయాలని హరినారాయణన్‌ను కోరారు.
వేలూరు జిల్లా పరిధిలో ఉన్న కాట్పాడి, కె.వి. కుప్పం, గుడియాత్తం నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాకు సరిహద్దుల్లో ఉన్నాయని తమిళనాడు అధికారులు వివరించారు. ఈ ప్రాంతాలలో ఉన్న తనిఖీ కేంద్రాలలో నిఘాను పెంచి అక్రమ మద్యం, నగదు రవాణాను కట్టడి చేయాలని వేలూర్ కలెక్టర్ షణ్ముగ సుందరం, ఎస్పీ చిత్తూరు కలెక్టర్‌ను కోరారు. తమిళనాడు సాధారణ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు చిత్తూరు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని కలెక్టర్ హరినారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:పుత్తూరులో గజరాజులు హల్చల్.. తరిమేందుకు స్థానికుల యత్నం