తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు.
సినీనటుడు రాజేంద్రప్రసాద్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ నుంచి సినిమా చిత్రీకరణలు పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.