ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రాకు క్యూ కడుతున్న తమిళనాడు మందుబాబులు! - ఆంధ్రకు క్యూ కడుతున్న తమిళనాడు మందుబాబులు

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని బలిజకండ్రిగ, గంగమాంబపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు మందుబాబుల తాకిడి పెరిగింది. సరిహద్దున ఉన్న తమిళనాడులో లాక్​డౌన్ విధించడంతో.. అక్కడి మందుబాబులు ఆంధ్రాకు క్యూ కడుతున్నారు. కనీసం భౌతిక దూరం, మాస్కు వంటి కొవిడ్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

drinkers queue before liquor shops in palasamudram
మద్యం దుకాణాలకు మందుబాబుల క్యూ

By

Published : May 15, 2021, 8:09 PM IST

క్యూలో ఉన్నారు... భౌతిక దూరం మరచారు!

కరోనా ఆంక్షలను పక్కన పెట్టి.. మద్యం కోసం మందుబాబులు బారులుతీరిన దృశ్యాలు చిత్తూరు జిల్లాలో కనిపించాయి. పాలసముద్రం మండలంలోని బలిజకండ్రిగ, గంగమాంబపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు మద్యం దుకాణాలకు తమిళనాడు నుంచి జనం పోటెత్తారు. మొదట గుంపులు గుంపులుగా మందు కోసం ఎగబడ్డారు. వరుస క్రమంలో రాకపోతే విక్రయాలు నిలిపివేస్తామని దుకాణ నిర్వాహకులు హెచ్చరించడంతో.. భౌతికదూరం, మాస్కులు లేకుండానే వరుసలో నిలుచున్నారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ ప్రకటనతో లిక్కర్ షాపుల ముందు బారులు

మే 10 నుంచి తమిళనాడులో సంపూర్ణ లాక్​డౌన్ అమలవుతుండటంతో.. అక్కడి మందుబాబులు మద్యం కోసం రాష్ట్రానికి వరుస కడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుంటుండగా.. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

యంత్రాలతో పనులు...గుంతల్లో అక్రమాలు

ABOUT THE AUTHOR

...view details