చిత్తూరు జిల్లాలో స్తబ్దతగా ఉన్న శేషాచల అడవులు స్మగ్లర్లతో నిండింది. కొన్నిరోజులుగా భాకరాపేట అటవీశాఖ అధికారులు శేషాచల అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. యర్రావారిపాళ్యం మండలంలోని అడవులలో స్మగ్లర్ల ఉనికి తెలియడంతో కూoబింగ్ ముమ్మరం చేశారు.
శేషాచల అడవులలో తమిళ స్మగ్లర్ల అలజడి - chittor district latest news
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో తమిళ స్మగ్లర్లు అలజడి సృష్టించారు. తలకోన ఆటవీప్రాంతంలోని ఉట్లదింపదడి వద్ద 26 మంది తమిళ స్మగ్లర్లు పోలీసులకు తారసపడ్డారు. వారి వద్దనున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
తలకోన ఆటవీప్రాంతంలోని ఉట్లదింపదడి వద్ద 26 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు దుంగలను పడవేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. సమీపప్రాంతాలను పరిశీలించిన అధికారులకు 25 ఎర్రచందనం దుంగలతో పాటుగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామళైకు చెందిన స్మగ్లర్లుగా గుర్తించారు. వారిని భాకరాపేట అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. పారిపోయిన వారికోసం శేషాచల అడవులలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి