చిత్తూరుజిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని శేషాచల అడవులలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేపట్టారు. తలకోన అటవీప్రాంతంలోని మర్రిమానుదడి వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు సుమారు 45మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూసి స్మగ్లర్లు దట్టమైన అడవిలోకి పారిపోయారు.
ఆరుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లింగ్
శేషాచల అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు, సివిల్ పోలీసులు దాడులు చేస్తున్నప్పటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సోమవారం తలకోన అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళ స్మగ్లర్ల అరెస్ట్
వారిని వెంబడించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన 6 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను, తమిళ స్మగ్లర్లను భాకరాపేట ప్రధాన కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎఫ్.ఆర్.ఓ పట్టాభి తెలిపారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'