చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. సరిహద్దులోని తమిళనాడు నుంచి భారీగా జనం వచ్చిన కారణంగా.. అమ్మకాలు నిలిపేశారు.
తమిళనాడులో మద్యం దుకాణాలు లేని కారణంగా.. అక్కడి వారు పాలసముద్రానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడి తహసీల్దార్ల విన్నపం మేరకు మద్యం దుకాణాలను ఏపీ అధికారులు మూసివేశారు.