చిత్తూరు జిల్లాలో.. తమిళనాడుకు చెందిన వృద్ద దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారి సొంత మేనల్లుడు ఆ ఇద్దరిని హత్య చేసి చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో తేల్చారు. వివరాల్లోకి వెళ్లితే...తమిళనాడులోని తిరుత్తణికి చెందిన సంజీవ రెడ్డి, మాల దంపతులు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనాంతరం వారి మేనల్లుడు రంజిత్..తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులోనే ఆ వృద్దులను చంపేసి చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో పడేశాడు. దీనిపై జూలై 29న తిరుత్తణిలో మిస్సింగ్ కేసు నమోదైంది.
MURDER: ఆస్తి కోసం అత్తామామలనే హతమార్చాడు..చివరికి.. - చిత్తూరు జిల్లా నేర వార్తలు
ఆస్తి కోసం సొంత మేనల్లుడు...అత్తామామలను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో సంచలనం రేపింది. తమిళనాడు పోలీసులు నిందుతున్ని అదుపులోకి తీసుకున్నారు.
అనుమానంతో రంజిత్ ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిన్న తమిళనాడు పోలీసులు రంజిత్‌ను వెంటపెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గుర్తించారు. అనంతరం రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు. నిన్న చీకటి పడటంతో ఇవాళ శవాలకు పంచానామా నిర్వహించారు. గత నెల 20వ తేదీ నుంచి సంజీవరెడ్డి, మాల దంపతులు కనిపించడం లేదని కుమారుడు జయకాంతన్ తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు మృతి చెందారని తెలుసుకున్న ఆతను సంఘటన స్థలానికి చేరుకుని కుళ్లిన మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: