ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎస్సై సహదేవి అధికారులతో సమీక్షించారు. బాలికలపై ఆకృత్యాలు ఎదుర్కొంటామని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేద్దామన్నారు. బాల్య దశ సంరక్షణకు పూర్తిస్థాయిలో అభివృద్ధికి కృషి జరగాలని పేర్కొన్నారు. సమీక్షలో వైద్యురాలు గిరిజ, ఎమ్ఈవో త్యాగరాజు, ఎంపీడీవో దివాకర్ రెడ్డి, సీడీపీవో నాగమణి పాల్గొన్నారు.
'బాలబాలికల బాల్య దశను సంరక్షిద్దాం' - chittoor district tamballapalli latest news
బాలబాలికల బాల్య దశను సంరక్షిద్దామంటూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎస్సై సహదేవి పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష జరిపారు. బడి ఈడు, అనాథ, తప్పిపోయిన పిల్లలను పాఠశాలలో చేర్పించి... అన్ని విధాలుగా చేయూత ఇద్దామంటూ అధికారులను కోరారు.
తంబళ్లపల్లె ఎస్సై సహదేవి