తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని తిరుమలలో జరిపారు. శ్రీవారి ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఊరేగించారు. అక్కడ ఉత్సవమూర్తులకు ఊంజల్‌సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను కళాకారులు ఆలపించారు. తితిదే ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్ర కచేరీ నిర్వహించారు.
తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి - తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి వార్తలు
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని తిరుమలలో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను కళాకారులు ఆలపించారు. స్వామివార్లను ఊరేగించారు.
తాళ్లపాక అన్నమాచార్యుల వర్థంతి
అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజి వేడుకల్లో పాల్గొన్నారు. అన్నమాచార్యుల వర్థంతిని తిరుమల, తిరుపతిలో పాటు తాళ్లపాకలో కూడా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి.ఇష్టారాజ్యంగా స్టడీ కేంద్రాలు... అక్రమాలకు దగ్గరగా దూరవిద్య..!