చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే పుడమి తల్లి పులకించి పచ్చని చెట్లతో తలకోన జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడున్న జలపాతం అందాలను వీక్షించడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాలైన చెన్నై, కర్ణాటక నుంచి కూడా పర్యాటక ప్రేమికులు తరలి వస్తున్నారు. ఇక్కడకు వచ్చిన యువకులు తమ సెల్ఫోన్లలో తలకోన అందాలను బంధిస్తూ సంబరపడుతున్నారు. తలకోనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిల్లతీగపై పిల్లలు, యువకులు ఊగుతూ కేరింతలు కొడుతున్నారు. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావటంతో అటవీశాఖ అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టారు.
తలకోన సోయగాలు.. చూపరులకు ఆనందాలు - talakona
గత రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివచ్చి.. అందాలను ఆస్వాదిస్తున్నారు.
తలకోన సోయగాలు చూద్దము రారండి