చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై అధికారులతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వైరస్ నియంత్రణకు పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు లేకపోయినా..ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి: ఎంపీ మిథున్ రెడ్డి - చిత్తూరు జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి