ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది' - వైకాపా ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శల వార్తలు

ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతూ వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. అధికార పార్టీ నేతలు పేదలు, దళితుల ఇంటి స్థలాలను అక్రమంగా లాగేసుకుంటున్నారని ఆరోపించారు.

sx mla sugunamma criticises ycp government
కలెక్టరుకు వినతిపత్రం అందిస్తున్న తెదేపా నేతలు

By

Published : Jun 15, 2020, 7:33 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న అక్రమాలు, అవినీతి, తెదేపా శ్రేణులను ఆర్థికంగా దెబ్బతీయడం వంటి వాటిని నిరసిస్తూ.. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నించే వారిని వైకాపా ప్రభుత్వం బెదిరిస్తోందని.. వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలో అధికార పార్టీ నేతలు పేదల ఇంటి స్థలాలను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details