ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అబ్బుర పరచిన స్వాట్​ టీమ్​ విన్యాసాలు - తిరుపతిలో పోలీస్‌ మీట్

తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల అరాచకాలను ఎదుర్కొనేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు చేసిన స్వాట్‌ టీమ్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ వ్యక్తులను కిడ్నాప్‌ చేయడం, బస్సులను హైజాక్‌ చేయడం, తీవ్రవాదులు ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో మాక్​ డ్రిల్​ ద్వారా చేసి చూపించారు. జనవరి నెలలో తిరుపతిలో నిర్వహిస్తున్న పోలీస్‌ మీట్‌లో ఈ బృందం కూడా పోటీ పడుతుంది.

swat performance at ongole
అబ్బుర పరచిన స్వాట్​ టీమ్​ విన్యాసాలు

By

Published : Dec 31, 2020, 8:52 PM IST

Updated : Dec 31, 2020, 10:37 PM IST

తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం పోలీసులు ఏర్పాటు చేసిన స్వాట్‌ టీమ్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. జనవరి నెలలో తిరుపతిలో నిర్వహిస్తున్న పోలీస్‌ మీట్‌ లో పాల్గొనేందుకు ఎంపికయిన ఈ టీమ్‌ ముందస్తుగా ఒంగోలు పౌలీస్‌ మైదనంలో ప్రదర్శనలు నిర్వహించింది. ప్రముఖ వ్యక్తులను కిడ్నాప్‌ చేయడం, బస్సులను హైజాక్‌ చేయడం, తీవ్రవాదులు ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు ఎదురయినప్పుడు వాటిని నిరోధించేందుకు స్వాట్‌ టీమ్‌ రూపుదిద్దుకుంది.

అబ్బుర పరచిన స్వాట్​ టీమ్​ విన్యాసాలు

ప్రకాశం జిల్లా పోలీసులు చేసిన స్వాట్‌ టీమ్‌ ప్రదర్శన ఒళ్ళు జలదిరించే విన్యాసాలు చేసింది. సాధారణంగా మావోయిస్టులను ఎదుర్కోవడానికి గ్రేహౌండ్స్‌, దొమ్మీలు వంటివి జరిగితే ప్రత్యేక దళాలు వంటివి పనిచేస్తుంటాయి. పోలీసు శాఖలో సైన్యానికి సంబంధించిన శిక్షణ అంతగా ఉండదు. కానీ ప్రకాశం జిల్లా పోలీసులు సైనికులకు ఉండే కొన్ని నైపుణ్యాలను తన సిబ్బందికి శిక్షణ ద్వారా నేర్పించారు. స్పెషల్‌ వెపన్‌ అండ్‌ టాక్టిక్స్ (స్వాట్‌) పేరుతో ఎంపిక చేసిన కొంతమంది కానిస్టేబుళ్ళు, ఎస్.ఐ. స్థాయి వారిని ఓ బృందంగా ఏర్పాటు చేసారు. ఈ టీమ్‌కు రాష్ట్ర స్థాయి గుర్తింపు కూడా లభించింది. జనవరి 4 నుంచి తిరుపతిలో నిర్వహిస్తున్న పోలీస్‌ మీట్‌లో ఈ బృందం కూడా పోటీ పడుతుంది. ఈ సందర్భంగా ఎస్.పి. సిద్దార్థ కౌశల్‌ సమక్షంలో టీమ్‌ ప్రదర్శనలు ఇచ్చింది.

తీవ్రవాద కలాపాలను అరికట్టడం, వారిని మట్టుపెట్డడం, దేశంలో ప్రముఖలైన వారు కిడ్నాప్‌కు గురయితే నేరస్థులనుంచి ఎలా రెస్య్కూ చేయాలి? వంటివాటిపై శిక్షణ ఇచ్చారు.. బాంబులు మోత, వాహనాలు ఛేజింగ్‌లు, కిడ్నాపర్లతో ఫైట్‌, నేరస్థులను శునకాలు గుర్తించడం, బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ ద్వారా బాంబులను నిర్వీర్యం చేయడం వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:తిరుపతిలో జనవరి 4నుంచి స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్

Last Updated : Dec 31, 2020, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details