తిరుపతి వేదికగా జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ లో రెండో రోజు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్( స్వాట్) కమాండోల ప్రదర్శన ఆకట్టుకుంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా ప్రకాశం జిల్లాకు చెందిన స్వాట్ బృందం తమ విన్యాసాలతో అలరించింది. శత్రువు అనుకోకుండా దాడి చేసినప్పుడు... ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన ఈ బృందం అవలంబించే విధానాలను కమాండోలు కళ్లకు కట్టారు. వానను సైతం లెక్కచేయకుండా... కమాండోలు చేసిన అద్భుత ప్రదర్శనను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా అభినందించారు.
జోరు వానలోనూ కమాండోల ప్రదర్శన - కమాండో విన్యాసాల వీడియో న్యూస్
శత్రువులు దాడి చేసినప్పుడు కమాండో సిబ్బంది ఎలా ఎదుర్కొంటారు... శత్రు మూక బస్సును హైజాక్ చేస్తే, అందులో వారిని ఎలా కాపాడుతారు.. ఆ విన్యాసాలన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. తిరుపతిలో జరగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్లో కమాండోల ప్రదర్శన మీరూ చూడండి.
![జోరు వానలోనూ కమాండోల ప్రదర్శన swat commandos performance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10134405-597-10134405-1609905007267.jpg)
కమాండోల విన్యాసాల ప్రదర్శన