ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పద్మనాభరెడ్డి - new vc padmanabareddy latest news
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ వి. పద్మనాభరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటి బోధన, బోధనేతర సిబ్బంది, సంఘం నాయకులు, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు.

ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి. పద్మనాభరెడ్డి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ వి. పద్మనాభరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పశువైద్య విశ్వవిద్యాలయ డైరీ సైన్స్ డీన్ గా పనిచేస్తూ జూన్ 30 న పదవీ విరమణ చేసిన ఆయనను నూతన ఉపకులపతిగా ఎంపిక చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఛార్జి వీసీగా కొనసాగుతున్న రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య నుంచి ఆన్లైన్ విధానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.