చిత్తూరు జిల్లా పీలేరులోని ఎంజేఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం సాయంత్రం పీలేరు - పులిచర్ల రైల్వేట్రాక్‌పై వెంకట్రామిరెడ్డి మృత దేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో వెంకట్రామిరెడ్డి మృతదేహం ఛిద్రమైపోయి ఉంది.
ఇది.. ఆత్మహత్యా లేదా ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతకొంత కాలంగా తరచూ సాయంత్రం నడక కోసం రైల్వేట్రాక్ వద్దకు వస్తున్న వెంకట్రామిరెడ్డి... ఈరోజు తిరుపతి - గుంతకల్ ప్యాసింజర్ రైలు కిందపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.