ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి - మదనపల్లి వార్తలు

ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of a woman in Madanapalle
మదనపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి

By

Published : Sep 11, 2020, 12:00 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని గౌతమి నగర్ కాలనీలో సుగుణ అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కర్నూలుకు చెందిన చంద్రకాంత్ మదనపల్లి సబ్ జైల్లో వార్డెన్​గా పని చేస్తున్నారు. తన స్నేహితురాలు కుమారుడు కేసు విషయంలో సుగుణ సబ్ జైలు వద్దకు స్నేహితులతో కలిసి వెళ్ళింది. ఈ నేపథ్యంలో.... అక్కడ పనిచేస్తున్న చంద్రకాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజుల పాటు వీరిద్దరు సహజీవనం చేశారు. ఇటీవల సుగుణకు చంద్రకాంత్​కు మధ్య గొడవలు జరిగాయి. గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో చంద్రకాంత్ ఇంట్లో ఉండగానే ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details