చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో అనుమానాస్పదంగా నిలిపిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తితిదే వసతిగృహలు శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం ఆవరణలో గడిచిన ఎనిమిది నెలలుగా వాహనాలు అనుమానాస్పదరీతిలో నిలిపినట్లు పోలీసులు గుర్తించారు.
తిరుపతిలో అనుమానాస్పద వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు - తిరుపతిలో అనుమానాస్పద వాహనాలను స్వాధీనం న్యూస్
తిరుపతిలో అనుమానాస్పదంగా నిలిపిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తితిదే నిబంధనలమేరకు రెండు రోజులకు మించి వాహనాలను నిలిపి ఉంచడానికి అవకాశం లేకపోవడం.. నెలల తరబడి వాహనాలు అక్కడే ఉండటంతో స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు.
Suspicious Bikes
తితిదే నిబంధనలమేరకు రెండు రోజులకు మించి వాహనాలను నిలిపి ఉంచడానికి అవకాశం లేకపోవడం.. నెలల తరబడి వాహనాలు అక్కడే ఉండటంతో స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలలో 46 ద్విచక్రవాహనాలు, 8 పెద్ద వాహనాలు ఉన్నాయి. అనుమానాస్పదంగా నిలిపిన వాహనాలకు సంబంధించిన ఆర్సీతో పాటు ఇతర పత్రాలను పోలీసులకు సమర్పిస్తే వాహనాలను అప్పగిస్తామని ఏఎస్పీ తెలిపారు.