ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2020, 11:19 AM IST

ETV Bharat / state

ప్రజల శ్రేయస్సు కోసమే సుందరకాండ అఖండ పారాయణం: తితిదే ఈవో

ప్రజల శ్రేయస్సు కోసం సుందరకాండ అఖండ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్​రెడ్డి అన్నారు. తిరుమల నాదనీరాజన మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేదపారాయణదారులు పాల్గొన్నారు.

tirumala sundarakanda akhanda parayan
సుందరకాండ అఖండ పారాయణం

లోకకళ్యాణం, ప్రజల ఆయురారోగ్యాల కోసం సుందరకాండ అఖండ పారాయణాన్నినిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్​రెడ్డి తెలిపారు. తిరుమల నాదనీరాజన మండపంలో నిర్వహించిన ఆరో విడత సుందరకాండ అఖండ పారాయణంలో ఈవో జవహర్​రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. సుందరకాండలో 20వ సర్గ నుంచి 24 సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేశారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాల, తిరుపతి వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సుమారు 200 మంది వేదపారాయణదారులు పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం సుందరకాండ పారాయణంతో పాటు భగవద్గీత పారాయణం, విరాట పర్వాలను సైతం నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు ఈవో జవహర్​రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details