ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్యాన్ని భరించలేక.. బలవన్మరణం - Suicide of a person with autism in Autonagar

తిరుపతి ఆటోనగర్ లో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందాడు. బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.

chittor district
ఆటోనగర్ లో అన్నారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

By

Published : May 11, 2020, 1:46 PM IST

తిరుపతి సమీపంలోని గొల్లవానిగుంటకు చెందిన ఎ.గోవిందరాజులు (48) కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన అతడు.. వైద్యం కోసం చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు చేసినట్టు కుటుంబీకులు చెప్పారు.

ఈ క్రమంలో.. వ్యాధి నయం కాక.. జీవితంపై విరక్తి చెంది కత్తితో కడుపు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోనగర్ లోని కనకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డట్టు అలిపిరి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details