కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతరలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అమ్మవారి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర - పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర
చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమయ్యింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది.
![ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర suguturu gangamma jathara in punganuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6448834-683-6448834-1584503946707.jpg)
ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర