చిత్తూరు జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్గా నియమితులైన పాలేరు రామచంద్రారెడ్డి... మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు.
పరిస్థితులకు తగ్గట్టు రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మామిడి, టమాటా పంటలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించటం ద్వారా రైతులకు మేలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి... వ్యవసాయ సలహామండలికి సూచించారు.