No Bills: మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలో వైకాపా వర్గీయుల నుంచే నిరసన ఎదురైంది. వడమాల పేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో చేపట్టిన రహదారుల నిర్మాణం బిల్లులకు సంబంధించి.. మంత్రి రోజా ఎదురుగానే మాజీ సర్పంచ్, అతడి భార్య నిరసనను వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రోజా గ్రామానికి రాగా.. పనులు చేయనివారికి బిల్లులు ఇచ్చారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైకాపా పార్టీని నమ్ముకుంటే తమను అప్పులపాలు చేశారని వాపోయారు.
మంత్రి రోజా ఎదుట బాధితుల ఆవేదన.. వైకాపాను నమ్ముకుంటే ఇలా చేస్తారా?
Minister Roja: వైకాపాను నమ్ముకుని పనులు చేస్తే.. బిల్లులు రాకా అప్పుల పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి రోజా నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా.. బుట్టిరెడ్డి కండ్రిగకు వచ్చిన రోజా ఎదుట మాజీ సర్పంచ్, ఆయన భార్య తమ గోడు వెళ్లబోసుకున్నారు.
roja