తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జిల్లా ఉన్నతాధికారులతో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ పామిడి శమంతకమణి సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై అధికారులతో చర్చించారు. సంక్షేమపథకాలన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసేలా శాఖాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, జిల్లాలోని పలు విభాగాల శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్ట్ పనుల్లో మహిళలు ఆశించినంతమేర లేరన్నారు. 50శాతం రిజర్వేషన్ల అమలును క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థ, నాడు-నేడు పనులు, నరేగా నిధుల అనుసంధానం వంటి విషయాలపై ఎప్పటికప్పుడు జిల్లాస్థాయి సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
'సంక్షేమ పథకాలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి' - తిరుపతిలో ఉన్నతాధికారులతో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం
సంక్షేమపథకాలన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసేలా శాఖాధికారులు బాధ్యత తీసుకోవాలని సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ పామిడి శమంతకమణి ఆదేశించారు.
!['సంక్షేమ పథకాలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి' తిరుపతిలో ఉన్నతాధికారులతో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6210522-510-6210522-1582716869958.jpg)
తిరుపతిలో ఉన్నతాధికారులతో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం
తిరుపతిలో ఉన్నతాధికారులతో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం
ఇవీ చదవండి