ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి పోలీస్ శిక్షణా కళాశాలకు సుభాష్ పత్రీజీ - చిత్తూరు తాజా వార్తలు

చంద్రగిరి మండలం కల్యాణిడ్యామ్ వద్దగల పోలీస్ శిక్షణా కళాశాలను పిరమిడ్ పితామహులు సుభాష్ సందర్శించారు. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఓ పిరమిడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ధ్యానం వల్ల సర్వరోగాలు నయమవుతాయని, ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలమని అన్నారు.

Subhash Patreji
చంద్రగిరి పోలీస్ శిక్షణా కళాశాలను సందర్శించిన పిరమిడ్ పితామహులు

By

Published : Jan 18, 2021, 10:47 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణిడ్యామ్ వద్ద పోలీస్ శిక్షణా కళాశాలను పిరమిడ్ పితామహులు సుభాష్ సందర్శించారు. పి.టీ.సీ. ప్రిన్సిపల్ సూర్యభాస్కర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి పరిసరప్రాంతాలను కలియదిరిగిన పత్రీజీ ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ పిరమిడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రిన్సిపాల్ కు చెప్పారు.

నూతనంగా నిర్మించిన చిన్న పిరమిడ్​ను సిబ్బంది చూపించడంతో పత్రీజీ సంతోషం వ్యక్తం చేశారు. ధ్యానం వల్ల సర్వరోగాలు నయమవుతాయని, ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారని అన్నారు. ఆ ప్రాంతంలో కోట్ల రూపాయలతో అత్యాధునిక పిరమిడ్ కేంద్రాన్ని పత్రీజీ నిర్మించ తలపెట్టినట్లు ప్రిన్సిపాల్ సూర్యభాస్కర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details