ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేడమ్... వెళ్లొద్దంటూ విద్యార్థుల కన్నీరు..! - students gives very sad sendoff to teacher

ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే హమ్మయ్యా..! అనుకుంటాం. వాళ్లు ఆరోజు విధుల్లో లేకపోతే ఎంచక్కా ఎంజాయ్ చేస్తాం. కానీ ఓ పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నంగా... అక్కడి ఉపాధ్యాయురాలు రాకపోతే ఆమెకోసం వేచిచూస్తారు. ఇప్పుడు ఆమె బదిలీపై వెళ్తుంటే... విద్యార్థులు బోరుమని విలపిస్తూ... కన్నీటి వీడ్కోలు పలికారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/27-November-2019/5191421_178_5191421_1574864727896.png
విద్యార్థుల కన్నీటి వీడ్కోలు

By

Published : Nov 27, 2019, 8:40 PM IST

మేడమ్... వెళ్లొద్దంటూ విద్యార్థుల కన్నీరు..!

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి.బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు వేదవతి. ఆ టీచర్ బదిలీ అయింది. వీడ్కోలు సభ నిర్వహించారు. ఆ ఉపాధ్యాయురాలు వెళ్తుంటే... విద్యార్థులు విలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. వేదవతి మూడేళ్ల పాటు విధి నిర్వహణలో విద్యార్థుల ఆదరాభిమానాలను పొందారు. ఆ టీచర్ వెళ్లకుండా దారికి అడ్డంగా ఉండి... తమ ప్రేమను చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details