కోర్టు తీర్పును స్వాగతిస్తూ విద్యార్థుల సంబరాలు గతేడాది చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో చిన్నారి హత్యాచార ఘటనలో నిందితునికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని.. అయితే మరణ దండన త్వరితగతిన అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
కన్నీటి పర్యంతమైన నిందితుని తల్లి
హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన నిందితుడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకు వివాహమైనప్పటి నుంచి తమ ఇంటికి రావడం లేదని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమకు తెలియదని... కన్నతల్లిగా తాను బాధపడటం తప్ప చేసేదేమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష