దండెత్తిన విద్యార్థులు... ప్రధానోపాధ్యాయుడు పరుగులు... - ప్రధానోపాధ్యాయుడిపై విద్యార్థుల దాడి
సాధారణంగా విద్యార్థులను ఉపాధ్యాయులు దండిస్తుంటారు. ఇందుకు విరుద్ధంగా తిరుపతి రూరల్ మండలం సత్యనారాయణపురంలో ప్రధానోపాధ్యాయుడిని దండించటానికి విద్యార్థులు యత్నించారు. అందరూ కలసి దాడి చేయబోతుంటే అతను పరుగులు పెట్టాడు.
![దండెత్తిన విద్యార్థులు... ప్రధానోపాధ్యాయుడు పరుగులు... students attacked head master in satyanarayanapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5467345-179-5467345-1577100818170.jpg)
తిరుపతి రూరల్ సత్యనారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కాసేపు ఆందోళన నెలకొంది. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో వేధిస్తున్నాడని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రయ్యపై.... పిల్లలు, వారి తల్లిదండ్రులు దాడి చేయడానికి ప్రయత్నించారు. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం కొట్టేందుకు యత్నించటంతో అతను పరుగులు పెట్టాడు. విద్యార్థులు అతని వెంటపడి దాడి చేయబోయారు. ఇంతలో పోలీసులు వచ్చి... వారిని అడ్డుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు పిల్లల పట్ల దురుసుగా, కఠినంగా వ్యవహరించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. క్రమశిక్షణ పేరుతో.... విద్యార్థులకు భారీగా జరిమానాలు విధిస్తున్నాడు అని మండిపడ్డారు. పోలీసులు వారికి నచ్చజెప్పటంతో వివాదం సర్దుమనిగింది.
ఇదీ చదవండి: మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతకండి సార్!