ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Student Vanished In Flood Water: వాగులో గల్లంతైన 9వ తరగతి విద్యార్థి - వాగులో గల్లంతైన 9వ తరగతి విద్యార్థి

Student Vanished In Flood Water: పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తూ ఓ 9వ తరగతి విద్యార్థి సైకిల్​తో సహా వాగులో కొట్టుకుపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నక్కలవాగు వద్ద చోటుచేసుకుంది. గజ ఈతగాళ్లు, జేసీబీలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వాగులో బాలుడు గల్లంతు
వాగులో బాలుడు గల్లంతు
author img

By

Published : Dec 7, 2021, 10:51 PM IST

Student Vanished In Flood Water: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తూ ఓ 9వ తరగతి విద్యార్థి సైకిల్​తో సహా వాగులో కొట్టుకుపోయాడు. నక్కలవాగు గ్రామం వద్ద వాగులో విద్యార్థి గల్లంతయ్యాడు. గమనించిన తోటి విద్యార్థులు, స్థానికులు బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా..ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం అందటంతో గజ ఈతగాళ్లు, జేసీబీలతో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి సైకిల్ బయటపడగా..బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు.

గల్లైంతన విద్యార్థి కుంట్రపాకం గ్రామానికి చెందిన పృథ్వీరాజ్​గా గుర్తించారు. 20 రోజుల క్రితం పీవీ పురం గ్రామానికి చెందిన సరళ అనే మహిళ కూడా ఇదే వాగులో గల్లంతయ్యింది. ఆమె ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవటంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details